కర్ణాటక సంగీతం సిద్ధాంతం – సంగీతం

కర్ణాటక సంగీతం సిద్ధాంతం – సంగీతం

సంగీతము
గీతం వాద్యం తథా నృత్యం
త్రయం సంగీత ముచ్యతే
అను ప్రమాణముచే గీత, వాద్య, నృత్యముల మూఢింటి చేరికయే సంగీతమని తెలియుఛున్నది. ఇచ్చట గీతమనగా గాత్ర సంగీతమునకు బదులుగా వాఢబడినది. అంతేకాని దానిని ఆధునిక సంగీతమందు కొన్ని ప్రత్యేక లక్షణములు కలిగిన సంగీత రచన గీతమని అర్ధము చేసుకొనరాదు. వాద్యముల నుంఢి పలికింపబడు సంగీతము వాద్య సంగీతమగును. గాత్ర వాద్య సంగీతముల సహకారంతో అలరారనున్నది నాట్యకళ. ఇచ్చట నృత్యము ముఖ్యాంశము. గాత్ర, వాద్య సంగీతముల సహాయములేనిదే నృత్య కళను స్వతంత్రముగా ప్రదర్శించుటకు వీలులేదు. అట్లు ప్రదర్శించిన అది ముఖాభినయము అగును. కాని పరిపూర్ణమైన కళాప్రదర్శన అయివుంఢదు. కావున నృత్యకళ పూర్తిగా గాత్ర వాద్య సంగీతములపై ఆధారపఢిన కళ. ఈ విధముగా గీత,వాద్య,నృత్యాదులతో కూడునట్టి సంగీతమునకు నాదము ప్రధానమగును. అట్టి నాదము వల్లనే శృతులును, ఆ శృతుల వల్లనే సప్తస్వరములును, ఆ స్వరముల వల్లనే రాగములును ఏర్పడుచున్నవి. కావున నాదము-శృతి-స్వరముల కలయికను కూఢా సంగీతమని చెప్పవచ్చును. గాత్ర సంగీతము-వాద్య సంగీతము-నృత్య సంగీతము ఈ మూడింటిని కలిపి తోర్యత్రికము అని చెప్పవచ్చును.
గాంధర్వము
గంధర్వము అనగా సంగీతము. ఇధి గంధర్వగానం నుండి వచ్చింది,స్వర్గలోకంలో గంధర్వులు సంగీతాన్ని ప్రదర్శించఢం ద్వారా ఇది గంధర్వ గాన సంగీతము అయినది.
భరతం – భరతముని ద్వారా గంధర్వం భూమికి తీసుకురాబడింది. కాబట్టి భరతం అనే పదం సంగీతానికి ఆపాదించబడింది. భరత అనే పదంలో భ అన్న పదం భావాన్ని, ర అన్న పదం రాగాన్ని, త అన్న పదం తాళాన్ని సుాచిస్తుంది. ఈ మూడూ సంగీతానికి కావలసిన ముఖ్యమైన అంశాలు.

భరతముని కాలమున మరియు అతనికి పూర్వము కూడా సంగీతము గాంధర్వమని పిలువబడినది. గాంధర్వ వేదము సామవేదమునకు ఉపవేదముగా ఎంచబడనది. భరతుడు నాట్యశాస్త్రమందు గాంధర్వమునకు ఈ క్రింది నిర్వచనము నిచ్చెను.
గాంధర్వ మితి విజ్ఞేయం
స్వర-తాళ-పదాశ్రయం
స్వర-తాళ-పదములతో కూడినది గాంధర్వ శాస్త్రమని భరతుని అభిప్రాయము. స్వరమనగా ధాతు విభాగమని, పదమనగా మాతు విభాగమని అర్ధము. స్వరములలో ఏర్పడిన సంగీతము పదములతో కూడి అనగా సంగీతము కలిగివుండి తాళము చేత నిబద్ధించబడినప్పుడు అది సంగీతమగునని అర్ధము. అనగా స్వరము, పదము తాళముతో చేరి గాంధర్వము అనగా సంగీతమగునని నిర్వచనము. సంగీతము-స్వరము,సాహిత్యము మరియు తాళములతో కూడియుండవలనని గాంధర్వశాస్త్రము అనగా సంగీత శాస్త్రమని తెలుసుకొనవలెను.
రాగ స్వరశ్చ తాళశ్చ
త్రిభి సంగీత ముచ్యతే
అను ప్రమాణముచే రాగము-స్వరము-తాళముల చేరికయే సంగీతమని కొందరు పెద్దలు చెప్పిరి.

administrator

Leave a Reply

WhatsApp chat